షూట్ కి రెడీ అవుతోన్న ‘లూసిఫర్’ !

షూట్ కి రెడీ అవుతోన్న ‘లూసిఫర్’ !

Published on Mar 16, 2021 11:00 AM IST

దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రిమేక్, చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రెగ్యులర్ షెడ్యుల్ ఏప్రిల్ సెకెండ్ వీక్ నుండి మొదలయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ రాజా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తీ చేశారని.. మెగాస్టార్ కూడా స్క్రిప్ట్ విషయంలో పూర్తీ సంతృప్తి చెందారని.. అందుకే ఈ సినిమాని లైన్ లో ముందుకు తీసుకువచ్చారట .

కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నారు. అలాగే తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మార్పులు చేయనున్నారట. ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుందట. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్, ఈ సినిమా పూర్తయిన తరువాత తమిళ ‘వేదాళం’ రీమేక్ ను కూడా మొదలుపెడతారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు