‘శ్రీనివాస మంగాపురం’ కోసం వన్ డే రీషూట్ ?

‘శ్రీనివాస మంగాపురం’ కోసం వన్ డే రీషూట్ ?

Published on Jun 25, 2026 5:09 PM IST

Srinivasa-Mangapuram

దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. కాగా ఈ చిత్రం 2026 జూలై 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఐతే, ఇప్పటికే ఫస్ట్ కాపీ బిఫోర్ వెర్షన్ ను టీమ్ చూసింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో కొన్ని షాట్స్ ను యాడ్ చేస్తే బాగుంటుందని.. జయకృష్ణ పై ఈ షాట్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి వన్ డే వరకు రీషూట్ ఉంటుందని టాక్. అన్నట్టు ఈ షూట్ లో జయకృష్ణతో పాటు మిగిలిన తారాగణం కూడా జాయిన్ అవుతుందట.

కాగా ఈ సినిమాకి మహేష్ బాబు సలహాలు, సూచనలు ఉన్నాయని.. మహేష్ ఫీడ్ బ్యాక్ ఈ సినిమాకి ఎంతగానో ఉపయోగ పడిందట. ఇక అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. కాగా తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథా నేపథ్యం సాగుతుందని.. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు