ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్ లేదా బ్రూస్ లీ) పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మార్చి ఎండింగ్ లో ప్రశాంత్ నీల్, కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ పై సాంగ్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అన్నట్టు సాంగ్ తో పాటు ఓ యాక్షన్ సీన్ ను కూడా షూట్ చేస్తారట.
భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.


