ఇండియన్ 2 లో గెస్ట్ రోల్ ?

Indian2

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కాగా ఈ సినిమాలో ఓ అతిధి పాత్రలో ఓ ప్రముఖ హీరో కనిపించబోతునట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ పాత్ర.. థియేటర్స్ లో ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఉంటుందని.. ఓ నిమిషం పాటు స్క్రీన్స్ అదిరిపోతాయని తెలుస్తోంది. ఇంతకీ కమల్ హాసన్ సినిమాలో కనిపించబోతున్న ఆ అతిధి ఎవరో తెలియాల్సి ఉంది.

ఐతే, ఈ అతిధి పాత్ర కేవలం రెండు సీన్లకు మాత్రమే పరిమితం అవుతుందట. కాగా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక భారతీయుడు 2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు నాటికి షూటింగ్ అంతా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version