మెగాస్టార్ సినిమాలో సీనియర్ హీరో ?

మెగాస్టార్ సినిమాలో సీనియర్ హీరో ?

Published on Jul 19, 2026 2:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరో శరత్ కుమార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే, శరత్ కుమార్ పాత్రతో పాటు సినిమాలో మరో స్పెషల్ పాత్ర కూడా ఉంటుందని.. ఇది నెగిటివ్ పాత్ర అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

పైగా ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. అలాగే, ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.

తాజా వార్తలు