‘కార్తికేయ – 2’లో ఆ హీరోయిన్ నటించట్లేదు !

‘కార్తికేయ – 2’లో ఆ హీరోయిన్ నటించట్లేదు !

Published on Jun 7, 2020 12:55 AM IST


చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ‘కార్తికేయలో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి.. ‘కార్తికేయ 2’లోనూ గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు.. ఆమె హీరోకి మాజీ ప్రేయసిగా నటించబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే కలర్స్ స్వాతి ‘కార్తికేయ 2’లో నటించట్లేదట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కాగా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట.

పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు