ఎన్టీఆర్ తో మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడట !

ఎన్టీఆర్ తో మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడట !

Published on Jun 21, 2021 11:50 AM IST

ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ త్రివిక్రమ్ తో మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీ చేయడానికి సన్నాహాలు చేసి, మధ్యలో డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా ఉంటుందని ప్రశాంత్ నీల్ తో సినిమా తర్వాత, ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తోందని గతంలోనే వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ తెలిసింది. త్రివిక్రమ్, మహేష్ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఎన్టీఆర్ సినిమాని 2022 మార్చిలో మొదలుపెట్టి.. వచ్చే ఏడాది దసరాకి సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో తరువాత మరో టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమా ప్లాన్ లో ఉన్నాడట.

అలాగే సంజయ్ లీలా భన్సాలీతో కూడా తారక్ ఒక సినిమాని కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. తనకు వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ తన తరువాత సినిమాలను చాలా ప్లాన్డ్ గా ఫిక్స్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో చేయనున్న సినిమా పై తారక్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా బాగా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు