‘దేవర సీక్వెల్’ కచ్చితంగా ఉంటుందని ఆ మధ్య ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. దీంతో, ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ‘దేవర పార్ట్-2′(Devara 2) షూట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందో ఇంకా క్లారిటీ లేదు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయడానికి కొరటాల శివ కసరత్తులు చేస్తున్నాడట. దేవర సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ పై వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అన్నట్టు కొరటాల శివ ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
