‘రవితేజ’తో యంగ్ బ్యూటీ స్పెషల్ సాంగ్ ?

‘రవితేజ’తో యంగ్ బ్యూటీ స్పెషల్ సాంగ్ ?

Published on Jun 24, 2026 5:32 PM IST

హీరో రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారు. ఈ సాంగ్ కోసం యంగ్ బ్యూటీ నభా నటేష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని శివ నిర్వాణ ఈ సాంగ్ ను పెట్టాడట. అన్నట్టు నభా నటేష్ ది కేవలం స్పెషల్ సాంగ్ మాత్రమే కాదు అని, ఆమెది ఒక గెస్ట్ రోల్ అని తెలుస్తోంది.

ముఖ్యంగా రవితేజ – నభా పాత్రల మధ్య కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయట. ఇక ‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అని రవితేజ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు