‘శ్రీనివాస మంగాపురం’ పై లేటెస్ట్ అప్ డేట్ !

‘శ్రీనివాస మంగాపురం’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Feb 17, 2026 9:49 AM IST

Srinivasa Mangapuram

దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్ర క్లైమాక్స్ లో వస్తోందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఓ సీనియర్ హీరోయిన్ ని అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. మరి ఏ సీనియర్ నటి ఈ పాత్రలో కనిపిస్తోందో చూడాలి.

కాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇప్పటికే కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. కాగా తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథా నేపథ్యం సాగుతుందని.. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

తాజా వార్తలు