కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, మొదట ఈ నెల మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా.. బాలకృష్ణకు మోకాలి గాయం కావడంతో షెడ్యూల్ రద్దు అయింది. ఐతే సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ మొదలుకానుందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో బాలయ్య లేని సన్నివేశాలను తీయబోతున్నారని తెలుస్తోంది. కేవలం ఈ షెడ్యూల్ కోసమే సుమారు 15 రోజులకు పైగా షూటింగ్ సాగనుంది. అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


