టాలెంటెడ్ కమెడియన్ నుండి కొత్త వెబ్ సిరీస్ !

Published on Apr 11, 2021 2:33 pm IST

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. కమెడియన్ సత్య కూడా మొత్తానికి ఒక వెబ్ సిరిస్ చేయబోతున్నాడు. తన ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కోసం అల్లు అరవింద్ యువ చిత్రనిర్మాతలతో పాటు డైరెక్టర్స్ తో సహా ‘ఆహా’ కోసం వెబ్ షోలను మరియు చిన్న చిత్రాలను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సత్య మెయిన్ మెయిన్ లీడ్ గా ఒక వెబ్ సిరీస్ నటిస్తోనట్లు తెలుస్తోంది.

ఇక భవిష్యత్ మొత్తం డిజిటల్ మీడియాదే అని అందరూ నమ్ముతున్నారు. ఓ వైపు థియేటర్స్ కి ఆదరణ పెరుగుతున్నా ఓటిటి ప్లాట్ ఫామ్స్ ను నటీనటులు ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆహా యాప్ ను తెలుగు వారికి మరింత చేరువ చేయడానికి అల్లు అరవింద్ షోలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా ఇంకా ఎక్కువుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో విరాటపర్వం పలాస డైరెక్టర్ కరుణ కుమార్ కూడా ఓ వెబ్ సిరీస్ నిర్మించే ప్లాన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :