వైరల్: కొత్త జంటకి ఘన స్వాగతం పలికిన విజయ్

వైరల్: కొత్త జంటకి ఘన స్వాగతం పలికిన విజయ్

Published on Mar 2, 2026 10:32 PM IST

Rashmika-3

మన టాలీవుడ్ ప్రేమ జంట సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో వీరి పెళ్లి తర్వాత ఆఫ్ లైన్ లో కనిపించడం మొదలు పెట్టారు. అయితే ఈ అన్నిటిలో కూడా బెస్ట్ మూమెంట్ గా మాత్రం విజయ్ దేవరకొండ సొంత ఊరు వెళ్లడం అనే చెప్పవచ్చు. దీనితో పాటుగా నాగర్ కర్నూలుకి వారు వెళ్లగా అక్కడి ప్రజలు వారికి భారీ స్వాగతం పలికిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

విజయ్ దేవరకొండ తన సతీమణితో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లాలోని తన సొంత గ్రామం తుమ్మనపేటలో తమ కొత్త ఫామ్‌హౌస్‌లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించిన అనంతరం, ఈ జంట స్థానికులందరికీ రిసెప్షన్ ఏర్పాటు చేసి విందు ఇచ్చారు. అలానే తమ ఊరికి చెందిన తొమ్మిది, పదవ తరగతి పిల్లలకి స్కాలర్ షిప్ ని కూడా అనౌన్స్ చేయడంతో విజయ్ తన ఉదారత చాటుకున్నాడు. ఇలా ప్రస్తుతం దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు