‘పెద్ది’ నుంచి నెక్స్ట్ వచ్చేది ‘స్పెషల్’ ట్రీట్..!

‘పెద్ది’ నుంచి నెక్స్ట్ వచ్చేది ‘స్పెషల్’ ట్రీట్..!

Published on May 22, 2026 2:00 AM IST

Peddi

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి చూపులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ పైనే ఉన్నాయి. ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి ఊపిరి పీల్చుకుంటుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. గతకొంత కాలంగా టాలీవుడ్‌లో నెలకొన్న సైలెన్స్‌ను పెద్ది బ్రేక్ చేస్తాడని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ మూవీలోని స్పెషల్ ఐటెం సాంగ్‌గా రాబోతున్న ‘హెల్లల్లలో’ అనే పాటను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ క్లూ ఇచ్చారు.

ఇక ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించినట్లు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే వెల్లడించగా.. ఈ పాటలో రామ్ చరణ్‌తో పాటు స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ డ్యాన్స్‌తో ఇరగదీయబోతుంది. ఈ కాంబినేషన్‌ను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సాంగ్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు