ఏకంగా మూడు సినిమాలు విడుదల చేయనున్న యంగ్ హీరో

ఏకంగా మూడు సినిమాలు విడుదల చేయనున్న యంగ్ హీరో

Published on Nov 6, 2019 8:22 AM IST

Nithin1

యంగ్ హీరో నితిన్ వచ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాలు విడుదల చేయనున్నాడు. ఆయన ప్రస్తుతం నాలుగు సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. గత ఏడాది నితిన్ దిల్ రాజు ప్రొడక్షన్ లో శ్రీనివాస కళ్యాణం చిత్రం చేశారు. ఆ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. శ్రీనివాస కళ్యాణం తరువాత ఏడాది గ్యాప్ తీసుకున్న నితిన్ వరుసనే మూడు ప్రాజెక్ట్స్ ప్రారంభించారు. అందులో ఒకటి భీష్మ కాగా, రెండు రంగ్ దే, అలాగే చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో చిత్రాన్ని నితిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవికాక నితిన్ తన 30వ చిత్రంగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.

కాగా వీటిలో నుండి కనీసం మూడు చిత్రాలు వచ్చే ఏడాది చేస్తారట. వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న భీష్మ, అలాగే వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రంగ్ దే తో పాటు విలక్షణ దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి రూపొందిస్తున్న చిత్రాలు 2020లో రానున్నాయి. కాబట్టి ఏడాదికి పైగా గ్యాప్ ఇచ్చిన నితిన్ వచ్చే ఏడాది మాత్రం తన ఫ్యాన్స్ కి త్రిబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. భీష్మ చిత్రం నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ఈరోజు ఉదయం 10:00 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసి తెలియజేశారు.

తాజా వార్తలు