నైజాంలో ‘ఎన్.జి.కె’ రెండు రోజుల కలెక్షన్స్ !

Published on Jun 2, 2019 11:22 am IST

సెల్వరాఘవన్ దర్శకత్వంలో.. సూర్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ – సాయి పల్లవి హీరోయిన్లుగా పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ‘ఎన్.జి.కె’ చిత్రం తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. కాగా ‘గజిని’, యముడు, సింగం లాంటి విభిన్న తరహా చిత్రాలతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న ‘సూర్య’ గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనకబడ్డాడు.

మరి టాలీవుడ్ లో డల్ అయిపోయిన సూర్య మార్కెట్ ను ‘ఎన్.జి.కె’ పెంచుతుందనుకుంటే.. ఈ సినిమా కూడా సూర్యకు నిరాశనే మిగిల్చింది. నైజాం బాక్సాఫీస్ వద్ద ‘ఎన్.జి.కె’ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది. శనివారం నాడు ‘ఎన్.జి.కె’ నైజాంలో రూ .80.68 లక్షలు గ్రాస్ ను, అలాగే కేవలం రూ .27.35 లక్షల షేర్ ను రాబట్టింది. నైజాంలో మొత్తం రెండు రోజులుకుగానూ ‘ఎన్.జి.కె’ 80.43 లక్షలు షేర్ ను రాబట్టింది.

హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్లు, అలాగే తెలంగాణలోని కొన్ని ప్రధాన ఏరియాల్లో ‘ఫలక్ నుమా దాస్’ కి ఆదరణ బాగుండటంతో.. నైజాంలో ‘ఎన్.జి.కె’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది.

సంబంధిత సమాచారం :

More