స్టార్ హీరో సినిమాకి సెన్సార్ అయింది !

స్టార్ హీరో సినిమాకి సెన్సార్ అయింది !

Published on May 22, 2019 9:05 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య 36వ చిత్రంగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేస్తోన్న ‘ఎన్జీకె’ సినిమా మే 31వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది.

కాగా ఈ చిత్రంలోసూర్య రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనుండగా ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

కాగా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు ఎన్.జి.కే మేకర్స్. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హల్ లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు