ఎన్ జి కె టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

ఎన్ జి కె టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Jan 26, 2019 10:20 AM IST

మచ్ అవైటెడ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘ఎన్ జి కె’ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఈ చిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు వున్నాయి. ఈచిత్రం యొక్క టీజర్ కొరకు సూర్య అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ టీజర్ విడుదల తేదీ ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు కానుకగా ఈ చిత్ర టీజర్ ను విడుదలచేయనున్నారు. మరి అదే రోజు తెలుగు వెర్షన్ టీజర్ కూడా విడుదల చేస్తారో లేదో చూడాలి. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ్తో పాటు తెలుగులోనూ ఏప్రిల్14న విడుదలకానుంది. ఇక సూర్య ప్రస్తుతం ‘కాప్పాన్’ చిత్రంలో నటిస్తున్నారు. కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంకూడా ఈ ఏడాది లోనే ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు