ఎన్ జి కె టీజర్ విడుదలకు టైం ఫిక్స్ !

Published on Feb 9, 2019 12:47 pm IST

మచ్ అవైటెడ్ మూవీ ‘ఎన్ జి కె’ చిత్రం యొక్క టీజర్ కోసం సూర్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ ను ఫిబ్రవరి 14న విడుదలచేయనున్నారని తెలిసిందే. తాజాగా రిలీజ్ టైం ను ఖరారు చేశారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఈ టీజర్ ను విడుదలచేయనున్నారు. ఈచిత్రంలో సూర్య పొలిటీషియన్ గా కనిపించనున్నాడని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు.

సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మరి ఈ టీజర్ అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :