కరోనా బాధితులకు నిధి అగర్వాల్ విరాళం !

Published on Apr 22, 2020 8:01 pm IST

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కరోనా బాధితుల సహాయార్థం కొరకు వివిధ కరోనా రిలీఫ్ ఫండ్లకు ఆర్థిక సాయం చేశారు. పిఎమ్ కేర్స్ ఫండ్ కు, సీఎం రిలీఫ్ ఫండ్ కు, కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు, కుక్కల సంక్షేమం కొరకు మరియు స్పూర్తి సంక్షేమ సేవా సంఘానికి విరాళం ఇచ్చింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.

ఈ సందర్భంగా నిధి అగర్వాల్ పోస్ట్ చేస్తూ.. “ప్రస్తుత కాలం మొత్తం ప్రపంచానికి చాలా కష్టమైన సమయం. మనమందరం అవసరం ఉన్న మన తోటి వారికి అండగా నిలబడాలి, మనం ఒకరికొకరం దయగా, ఉదారంగా ఉండాలి” అని నిధి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

కాగా నిధి అగర్వాల్ ప్రస్తుతం అశోక్ గల్లా తొలి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే తమిళ హీరో జయం రవి సినిమాతో పాటు జేమ్స్ అనే కన్నడ చిత్రంలో కూడా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :