పవన్ పై ఎగ్జైటింగ్ కామెంట్స్ చేసిన నిధి అగర్వాల్.!

Published on Dec 29, 2021 8:59 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాలు అలాగే తన రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మరి తాను చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటని అందరికీ తెలిసిందే.

మరి ఈ సినిమాలో మొట్ట మొదటి సరిగా పవన్ సరసన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఆమె పవన్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చెయ్యడం వైరల్ అవుతుంది.

పవన్ తన మోస్ట్ ఫేవరేట్ మరియు టెర్రిఫిక్ పెర్ఫామర్ అని అంతే కాకుండా పవన్ సర్ దేవుని ఆశీస్సులతో కలిగిన ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాంటి వారని తెలిపింది. దీనితో ఇపుడు ఈ కామెంట్స్ ఎంతగానో వైరల్ అవుతున్నాయి. మరి ఈమె వీరమల్లు సినిమాలో పంచమి అంటే ఆసక్తికర పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ షూటింగ్ కూడా వచ్చే జనవరి నుంచి రీస్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :