నిధి ఆశ నెరవేరేనా ?

నిధి ఆశ నెరవేరేనా ?

Published on May 27, 2019 4:02 PM IST

ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గానే ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ రెండు పెద్ద సినిమాలు చేసినా ఇంకా నిలదొక్కుకోలేదు. ‘సవ్యసాచి, మిస్టర్ మజ్ను’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతంతమాత్రంగానే పెర్ఫార్మ్ చేయడంతో ఆమెకు సెటిల్డ్ హీరోయిన్ అనే పేరు రాలేదు. ప్రేక్షకుల్లో ఆమెపై ఇంట్రస్ట్ కొద్దిగా తగ్గింది కూడా. ఇలా మొదటి రెండు అవకాశాలు పెద్దగా క్రేజ్ ఇవ్వకపోవడంతో మూడో ప్రాజెక్ట్ ‘ఇస్మార్ట్ శంకర్’ మీదే నిధి ఆశలు పెట్టుకుంది.

ఎందుకంటే ఈసారి ఆమె స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నటిస్తోంది. సినిమా హిట్టైతే క్రేజ్ దానంతటదే వచ్చేస్తుంది. అలాంటి సినిమాల్లో పెర్ఫార్మెన్న్ చేయడానికి స్కోప్ ఉన్నా లేకున్నా సన్నివేశాలు, పాటలు ఇలా సినిమా మొత్తం అందంగా కనిపిస్తూ ప్రేక్షకుల మన్నన పొందవచ్చు. నటించే స్కోప్ ఉంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఆ సక్సెస్ స్థాయి వేరే లెవల్లో ఉంటుంది. మరి ఈసారైనా నిధిని అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు