అక్కినేని అఖిల్ తన మూడవ చిత్రాన్ని ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అఖిల్ సరసన కథానాయకిగా నటించబోయే నటి ఎవరనే విషయంలో ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. వారిలో రష్మిక మందన్న పేరు ప్రముఖంగా వినిపించగా ఇప్పుడు నిధి అగర్వాల్ తెర మీదికొచ్చింది.
అఖిల్ కు జోడీగా కొత్త నటి అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు నిధి అగర్వాల్ ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే ఆమె టెస్ట్ షూట్లో పాల్గొన్నారని, ఆమె పెర్ఫార్మెన్స్ పట్ల మేకర్స్ పాజిటివ్ గా ఉన్నారని, తొందర్లోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. నిధి అగర్వాల్ ప్రస్తుతం అఖిల్ సోదరుడు నాగ చైతన్య తాజా చిత్రం ‘సవ్యసాచి’లో కథానాయకిగా నటిస్తోంది.
