డేటింగ్ వార్తలను ఖండించిన యువ హీరోయిన్ !

డేటింగ్ వార్తలను ఖండించిన యువ హీరోయిన్ !

Published on Jun 3, 2018 3:31 PM IST

గత కొన్ని రోజులగా తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు హీరోయిన్ నిధి అగర్వాల్ . టీంఇండియా క్రికెటర్ కే ఎల్ రాహుల్ తో ప్రేమలో వున్నారని వార్తలు వచ్చాయి . వీళ్లిద్దరు కలిసి బయట కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని ప్రచారం చేశాయి.తాజాగా ఈ వార్తల ఫై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందించిన నిధి నేను రాహుల్ చిన్నప్పటినుండి మంచి స్నేహితులమని తరుచు కలుస్తామని అంతే తప్ప మేమిద్దరం డేటింగ్ లో ఉన్నామని వస్తున్న వార్తలు రూమర్స్ మాత్రేమే అని వివరించారు.

ప్రస్తుతం నిధి అగర్వాల్ నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కి పరచియం అవుతుంది. ఈ సినిమా తరువాత అఖిల్ అక్కినేనితో మరో చిత్రంలో నటించనుంది నిధి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు