హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్ తన మొక్కులను చెల్లించుకున్నారు. వైకుంఠంలో టీటీడీ అధికారులు స్వాగతం పలికిన అనంతరం, రంగనాయక మండపంలో నిధి అగర్వాల్ కి వేద ఆశీర్వచనం చేశారు.
ఇక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను నిధి అగర్వాల్ కి అందజేశారు. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ కొత్త సినిమాల విషయానికి వస్తే.. ఆమె తమిళంలో ఓ కొత్త సినిమా మొదలుపెట్టనుంది. తెలుగులో ప్రభాస్ రాజాసాబ్ చిత్రంలోకి నిధి అగర్వాల్ ఓ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే, ఈ సినిమా ఆమె కెరీర్ కి ఎలాంటి బూస్టప్ ను అందించలేకపోయింది.
