మహేష్ మేనల్లుడి కోసం ఇస్మార్ హీరోయిన్

Published on Nov 8, 2019 2:45 pm IST

సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు మరియు తెలుగు దేశం ఎం పి గల్లా జైదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు నిన్న అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. ఈనెల 10న రామానాయుడు స్టూడియోలో టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ ని ఎంపిక చేశారు. అక్కినేని హీరోల సరసన సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలలో నిధి అగర్వాల్ నటించింది.

ఇక పూరి-రామ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో నిధి అగర్వాల్ మొదటి హిట్ అందుకున్నారు. తాజాగా తెలుగులో అశోక్ గల్లా డెబ్యూ మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. భ‌లే మంచి రోజు, శ‌మంత‌క మ‌ణి, దేవ‌దాస్ చిత్రాల‌తో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More