పవన్ విషయంలో ఆ హీరోయిన్ బాగా హర్ట్ అయింది

పవన్ విషయంలో ఆ హీరోయిన్ బాగా హర్ట్ అయింది

Published on Sep 3, 2019 8:32 PM IST

a

నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఆయన అభిమానులు విశేషంగా జరుపుకున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు చాలా మంది పవన్‌కు
సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో పవన్ సరసన ‘పులి’ సినిమాలో కథానయకిగా నటించిన నికీషా పటేల్ కూడా ఉంది.

పవన్‌కు బర్త్ డే విషెస్ బాగానే చెప్పిన నికీషా పటేల్ పొరపాటున యాంటీ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. పొరపాటు తెలుసుకుని ఆ తర్వాత దాన్ని కరెక్ట్ చేసింది.
దీంతో పవన్ అభిమానులు తీవ్రంగా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెపై మండిపడ్డారు. మీడియా సైతం ఈ చిన్న విషయాన్ని గట్టిగానే హైలెట్ చేసింది. దీంతో నికీషాకు కోపం కట్టలు తెంచుకుంది.

‘మీడియా, అభిమానులు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ట్రోల్ చేయడం ఆపితే బాగుంటుంది. పవన్ మీద నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. పొరపాటు అనుకోకుండా జరిగింది. అయినా ఇలాంటి నెగెటివ్ ట్యాగ్స్ క్రియేట్ చేసే ఇడియట్స్ ఎవరు. కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను’ అంటూ స్పందించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు