యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘కిరాక్ పార్టి’. ఈ నెల 16న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్బంగా చిత్ర టీమ్ కిరాక్ టూర్ పేరుతో భారీ టూర్ ను ప్లాన్ చేసింది. ఈ టూర్ ద్వారా చిత్రాన్ని యువతకు బాగా దగ్గరచెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.
9 నుండి మొదలుకానున్న ఈ టూర్లో నిఖిల్ అండ్ టీమ్ 9వ తేదీన విజయనగరం, వైజాగ్, 10న కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, గన్నవరం, 11న గుంటూరు, విజయవాడ, 12న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలన్నీ ఎక్కువ భాగాం కళాశాలల్లోనే ఉండనున్నాయి. ఇలా వేసవి సెలవుల్లో యువతను టార్గెట్ చేయడం ఓపెనింగ్స్ కు బాగా కలిసొచ్చే అంశంగా మారనుంది. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, చందూ మొండేటి డైలాగ్స్ అందించారు.


