
‘హ్యాపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో నిఖిల్ సోలో హీరోగా అందుకున్న బిగ్గెస్ట్ హిట్ ‘స్వామి రారా’. ఈ సినిమాకి సీక్వెల్ తీయనున్నామని నిన్ననే ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అనౌన్స్ చేసారు.
మీడియాకి ఇచ్చిన వార్తల్లో క్లారిటీ లేని కొన్ని విషయాలపై నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. ‘ స్వామి రారా సీక్వెల్ విషయం ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. నేను కూడా ఈ మూవీ ప్రొడక్షన్ టీంలో ఒక్కడిని. ఈ సినిమా మొదలవ్వచ్చు లేదా మొదలు కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఒక ఐడియా మీద మాత్రం వర్క్ చేస్తున్నాం. స్వామి రారా కంటే స్క్రిప్ట్ బాగా వస్తేనే స్వామి రారా సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుందని’ నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
నిఖిల్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ’ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు.

