
సి.సి.ఎల్ ట్రోఫీ సాధించిన విజయానందంలో మన టాలీవుడ్ జట్టు తెలుగు వారియర్స్ వున్న తరుణంలో జట్టులో భాగమైన యువ హీరో నిఖిల్ తన తాజా చిత్రం ‘సూర్య vs సూర్య’ డబ్బింగ్ పనులలో బిజీగా వున్నాడు. ఈ చిత్రంలో ‘పోర్ఫీరియా’ అనే కొత్తరకం జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిగా నిఖిల్ కనిపించనున్నాడు.
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ వంటి విజయాలతో నిఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుకుంటూ వచ్చాడు. తన తదుపరి ప్రాజెక్ట్ లు ఎక్కడా తడబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. డబ్బింగ్ పనులను ఈ నెలలో సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బెంగాళీ భామ త్రిధా చౌదరి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయంకానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు.

