నిఖిల్ ముద్ర టైటిల్ మారనుంది !

Published on Feb 3, 2019 12:31 pm IST

యువ హీరో నిఖిల్ నటిస్తున్న ‘ముద్ర’ చిత్రం యొక్క టైటిల్ మారనుంది. ఇటీవల ఈ టైటిల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈ చిత్రం యొక్క కొత్త టైటిల్ ను అలాగే ఫ్రెష్ లుక్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదలచేయనున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వాయిదాపడుతూ వస్తుంది. ఇక తాజాగా ఈ చిత్ర విడుదల ఫై కూడా క్లారిటీ వచ్చింది. మార్చి చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన టి యెన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇక నిఖిల్ గత ఏడాది కిరాక్ పార్టీ అనే రీమేక్ తో ప్రేక్షకులముందుకు వచ్చి విజయాన్ని సాదించలేకపోయాడు. మరి నిఖిల్ కు ఈ సారైనా ఈ తమిళ రీమేక్ రూపంలో విజయం అందుకుంటాడో లేదో చూడాలి. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ఠాగూర్ మధు విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :