‘స్వామి రారా’ సినిమాతో విజయం అందుకున్న యంగ్ హీరో నిఖిల్ ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో రూపొంచించిన ‘కార్తికేయ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఆగష్టు చివర్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండడంతో నిఖిల్ తన అతడుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. ఇప్పటికీ కార్తీక్ ఘట్టమనేని అనే నూతన డైరెక్టర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఓ ఆసక్తికరమైన పాయింట్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘సూర్య vs సూర్య’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. శివ కుమార్ నిర్మించనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.


