యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియడ్ వార్ డ్రామా ‘స్వయంభు’. భారీ బడ్జెట్‌తో, టెక్నికల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ అద్భుతమైన విజువల్స్‌తో, నిఖిల్ పవర్ఫుల్ వారియర్ లుక్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను 2026, ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.
ఇక తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్లో నిఖిల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ‘స్వయంభు’ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని ఆయన అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. నటి నభా నటేష్ పాత్ర గురించి మరియు సెకండ్ పార్ట్‌లో ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో వివరిస్తూ నిఖిల్ ఈ విషయాన్ని తెలియజేశాడు. దీంతో మొదటి భాగం ఏప్రిల్‌లో విడుదలవుతుండగా, రెండో భాగం ఎప్పుడు వస్తుందనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది.
పిక్సెల్ స్టూడియోస్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తుండగా, సునీల్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
