బ్రాండ్ అంబాసిడర్ గా మారిన నిఖిల్

బ్రాండ్ అంబాసిడర్ గా మారిన నిఖిల్

Published on Jan 16, 2015 12:40 PM IST

nikhil
సినిమా హీరోలు లేదా హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తూనే వారికున్న క్రేజ్ ని బట్టి కొన్ని ఫేమస్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తూ ఉంటారు. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్. ఈ సినిమాల హిట్ తో వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న నిఖిల్ కి కొత్తగా బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు. అది కూడా ఓ క్లాత్ ఎంపోరియం బ్రాండ్ కి అంబాసిడర్ గా ఎన్నికయ్యాడు.

‘క్లాత్ ప్రపంచంలో ఫార్మల్ డ్రెస్ కి బర్నాడ్ అయిన యూక్లిడ్ అనే బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసానని’ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇలా స్ట్రైట్ గా బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చెయ్యడం వలన నిఖిల్ పాపులారిటీ మరింత పెరుగుతుంది. చాలా మంది స్టార్ హీరోలు కూడా ఇలాంటి పాపులర్ బ్రాండ్స్ ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. నిఖిల్ ప్రస్తుతం ‘సూర్య vs సూర్య’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు