
‘స్వామి రారా’ విజయం తరువాత నిఖిల్ కి వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. సరికొత్త కధలతో టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఎంపిక చేసుకుంటూ ‘కార్తికేయ’ ద్వారా తన విజయ పరంపరను కొనసాగించాడు. ఈసారి కొత్త తరహా రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటూ ‘సూర్య vs సూర్య’ సినిమాతో మనముందుకు రానున్నాడు. నిన్న ఈ సినిమాకి సంబంధించిన ‘ప్రేమే సంతోషం’ పాటను మీడియాకి విడుదల చేశారు. ఈ పాట అనతికాలంలోనే ప్రజాదరణ పొందింది.
విశేషమేమిటంటే ఈ పాటలో సాహిత్యాన్ని తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ పదాలను ఉపయోగించి రాసారు. సంగీతంలో సైతం మెలోడీ, మోడరన్ బీట్స్ ని జతచేయడం విశేషం. రామజోగయ్య శాస్త్రి కలం, సత్య మహావీర్ అందించిన స్వరం ఈ పాటకు అదనపు అందాన్ని అందించాయి.
ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు పాటకూడా మంచి విజయం సాధించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.