నీడతో యుద్ధం ఎలా వుంటుందో !

Published on Apr 22, 2019 2:55 pm IST

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న కొత్త చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే` పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన అన్య సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. అవుట్ ఫుట్ బాగా వచ్చిందట. త్వరలోనే ఈ చిత్రం టీజర్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారని చిత్రబృందం తెలిపింది. కార్తీక్ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

కాగా మనిషి తన నీడతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా వుంటుందో అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదలకానుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

కాగా ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌ తీసుకుని ఎమోష‌న‌ల్ హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం.. హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.

సంబంధిత సమాచారం :