షూట్ కి రెడీ అవుతున్న ‘భీష్మ’ !

Published on Jan 17, 2019 8:39 am IST

‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. కాగా ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయింది. ఇక ఈ నెలాఖర్లోనే ఈ సినిమా షూట్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్, భీష్మ చిత్రం పై మరింత దృష్టి పెట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More