యేలేటి థ్రిల్లర్ లో నితిన్ డబుల్ యాక్షన్ ?

Published on Oct 24, 2020 5:00 pm IST

నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో చిత్రం చేయడానికి ఇప్పటికే నితిన్ అన్ని రకాలుగా ప్లాన్ చేసుకున్నాడు. అన్నట్లు ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే వార్త గత కొన్ని నెలలుగా బాగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. సినిమా కథనం మొత్తం చదరంగం ఆటను పోలి ఉంటుందని.. పాత్రల మధ్య డ్రామా అండ్ ఎత్తులు పైఎత్తులు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని సమాచారం. అందుకే టైటిల్ కూడా అలా పెడుతున్నారని తెలుస్తోంది. పైగా సినిమాలో నితిన్ డ్యుయేల్ రోల్ చేయబోతున్నాడట.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ సెకెండ్ వీక్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ తో కూడిన కథలై ఉంటాయి కాబట్టి ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలోనే ఉండనుంది. ఇక నితిన్ లాస్ట్ సినిమా ‘భీష్మ’ భారి స్థాయిలో ఆకట్టుకోని సూపర్ హిట్ అవ్వడంతో నితిన్ నుండి రాబోయే సినిమాల పై భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే నితిన్ కూడా ఆ సక్సెస్ ను కొనసాగించాడానికి తన తదుపరి సినిమాల పై మరింత దృష్టి పెట్టారు. మరి ఈ ‘చదరంగం’ చిత్రంతో కూడా నితిన్ మరో సూపర్ హిట్ ఆయనకు దక్కుతుందేమో చూడాలి. అన్నట్టు ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More