వరుస హిట్స్ అందుకొని ఫుల్ జోష్ మీదున్న యంగ్ హీరో నితిన్ హీరోగా, సూపర్బ్ లవ్ ఎంటర్టైనర్స్ చేయడంలో మంచి పేరున్న కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న విషయం మనకు తెలిసిందే. జూన్ లో సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా ఇప్పటికే మొదటి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. టైటిల్ ఖరారు చేయకుండా సెట్స్ పైకి తీసుకెళ్ళిన ఈ సినిమాకి ఈ చిత్ర టీం టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. నితిన్ – కరుణాకరన్ టీం ఈ సినిమాకి ‘చిన్నదాన నీ కోసం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.
ఇష్క్, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలకు హిట్ సినిమా సాంగ్స్ లో లైన్స్ ని టైటిల్ గా ఎంచుకున్న నితిన్ ఈ సినిమాకి కూడా తన ఇష్క్ సినిమాలోని ఓ పాటలోని ‘చిన్నదాన నీ కోసం’ అనే ఫేమస్ లైన్ ఎంచుకోవడం విశేషం. ఈ సినిమాలో నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకునే కరుణాకరన్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


