పూరీ-నితిన్‌ల సినిమా ఆగిపోయింది!

nitin-puri
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో నితిన్‌తో ఓ కొత్త సినిమాను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘హార్ట్ అటాక్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందే సినిమా కావడంతో ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే మంచి అంచనాలున్నాయి. అయితే సడెన్‌గా ఈ సినిమా ఆగిపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తై, ఈ నెల 15న సెట్స్‌పైకి వెళ్ళాల్సిన సినిమా ఇలా అకస్మాత్తుగా ఆగిపోవడం శోచనీయంగా కనిపిస్తోంది.

ఇక ఈ సినిమా ఆగిపోయిందన్న విషయాన్ని పూరీ జగన్నాథ్, నితిన్‌లు విడివిడిగా తమ ట్విట్టర్ ఎకౌంట్‌లలో తెలిపారు. తాను నితిన్‌తో ప్లాన్ చేసిన సినిమా క్యాన్సిల్ అయిందని, వేరొక హీరోతో ఇంతకుముందు తెలియజేసిన రోజునుంచే షూటింగ్ మొదలుకానుందని పూరీ తెలిపారు. ఇక నితిన్ సైతం తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో సినిమా ఆగిపోయిందన్న విషయాన్ని తెలియజేశారు. “పూరీ గారితో ప్లాన్ చేసిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. భవిష్యత్‌లో ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా” అంటూ నితిన్ సినిమా ఆగిపోయిన విషయాన్ని తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాలు ఇంకా బయటకు రాలేదు. ఆ కారణాలు ఏమై ఉంటాయనే దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నితిన్ ప్లేస్‌లో కొత్తగా నటించబోయే హీరో ఎవరన్న దానిపై కూడా పూరీ జగన్నాథ్ ఇంకా స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. నితిన్ ప్లేస్‌లో
వరుణ్ తేజ్‌ను తీసుకుంటున్నట్లు ఓ ప్రచారం జరుగుతోంది.

Exit mobile version