నితిన్ నైజాంలో మొదటిరోజు బాగానే రాబట్టాడు

Published on Feb 22, 2020 9:23 am IST

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ నిన్న శివరాత్రి కానుకగా విడుదలైన హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు వెంకీ కుడుములు అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం మొదటిరోజు వసూళ్లు వర్షం కురిపించింది. నైజాం లో భీష్మ 2.21 కోట్ల షేర్ రాబట్టింది. ఇది నితిన్ నైజాం కెరీర్ సెకండ్ బెస్ట్ . నితిన్ నటించిన అ ఆ..2.30 కోట్లతో అతని కెరీర్ బెస్ట్ గా ఉంది. ఓవర్ ఆల్ గా తెలుగు రాష్ట్రాలలో భీష్మ మొదటిరోజు బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుందని తెలుస్తుంది.

భీష్మ చిత్రంలో నితిన్ కి జంటగా హీరోయిన్ రష్మిక మందాన నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇక భీష్మ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ అందించారు. ఏడాదికి పైగా గ్యాప్ తరువాత వచ్చిన నితిన్ భీష్మ రూపంలో మంచి హిట్ అందుకున్నారు.

సంబంధిత సమాచారం :