పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా ఎందరో యువకులను సినిమా రంగంలో అడుగులు వేసేలా వారి మదిలో బలమైన ముద్ర వేసింది. ‘తొలిప్రేమ’ సినిమా చూసి నితిన్ కూడా హీరో కావాలని నిర్ణయించుకున్నారు. ‘తొలిప్రేమ’ విడుదలైన ఇన్నాళ్ళకు కరుణాకరన్ దర్శకత్వంలో నితిన్ నటించే అవకాశం కుదిరింది. వీరిద్దరూ కలసి పని చేసిన ‘చిన్నదాన నీ కోసం’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ శనివారం రాత్రి తిరుపతిలో ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నితిన్, మిస్త్రీ, కరుణాకర్, అనూప్ రూబెన్స్, ఆలీ హాజరయ్యారు.
నితిన్ మాట్లాడుతూ.. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ‘చిన్నదాన నీ కోసం’ సినిమా ‘తొలిప్రేమ’ తరహాలో ఉంటుంది. ‘చిన్నదాన నీ కోసం’లో కూడా ప్యూర్ లవ్ స్టొరీ, డీసెంట్ కామెడీ ఉన్నాయి. ఈ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా నటించాను. అని అన్నారు. నితిన్ గత సినిమాలలో కూడా పవన్ ప్రస్తవన ఉంది. పవన్ పై తన అభిమాన్ని నితిన్ పలు సందర్భాలలో వెల్లడించారు.
సినిమా విజయవంతం కావాలని శుక్రవారం సాయంత్రం హీరో హీరోయిన్లు కాలినడకన తిరుమల చేరుకుని శనివారం ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమల కొండను కేవలం 2.25 గంటల్లో నితిన్ ఎక్కడం విశేషం.
