ఇంట్రెస్టింగ్..”మాస్ట్రో” గా వస్తున్న నితిన్..!

Published on Mar 30, 2021 7:02 am IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నుంచి ఇప్పటికే తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర “చెక్” మరియు “రంగ్ దే” సినిమాలు వచ్చాయి. వీటిలో రంగ్ దే మంచి టాక్ తెచ్చుకొని డీసెంట్ వసూళ్లను కూడా రాబడుతుంది. ఇక ఇదిలా ఉండగా నితిన్ కు మున్ముందు మరింత ఇంట్రెస్టింగ్ లైనప్ నితిన్ కు ఉన్న సంగతి తెలిసిందే..

వాటిలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ “అంధ దూన్” చిత్రం కు రీమేక్ కూడా ఒకటి. నితిన్ కెరీర్ లో బెంచ్ మార్క్ ఫిల్మ్ 30వ చిత్రంగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా మేకర్స్ ఈ చిత్రం తాలూకా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను నితిన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసారు..

అంధుల స్టిక్ పట్టుకొని స్టైలిష్ డ్రెస్సింగ్ లో ఒక పియానో లాంటి దానిపై నడుస్తున్నట్టుగా డిజైన్ చేసి మేకర్స్ వదిలారు.. ఇది ఒకింత ఆసక్తి రేపుతోంది. అలాగే ఇందులోనే “మాస్ట్రో” అనే టైటిల్ ను రివీల్ చేసారు. ఇక ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో నటిస్తుండగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ వారు వచ్చే జూన్ 11న విడుదల చేస్తున్నట్టుగా కూడా ప్రకటించేశారు..

సంబంధిత సమాచారం :