సెన్సార్ పూర్తి చేసుకున్న నితిన్ “రంగ్ దే”.!

Published on Mar 19, 2021 5:30 pm IST

గత ఏడాది యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన “భీష్మ” మంచి హిట్టయ్యింది. దానితో మంచి కం బ్యాక్ అనుకున్న నితిన్ కు మళ్ళీ ఈ ఏడాది “చెక్” చెక్ చెప్పింది. దీనితో ఇప్పుడు ఆశలు అన్నీ తాను చేస్తున్న మరో చిత్రం “రంగ్ దే” పైనే పెట్టుకున్నాడు నితిన్. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామాపై ఎప్పటి నుంచో మంచి అంచనాలు ఉన్నాయి.

మరి ఇంకొన్ని రోజుల్లో విడుదలకు రెడీగా ఉన్న ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఇప్పటికే ప్రమోషన్స్ లో మంచి బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఈ సినిమా అవుట్ ఫుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :