షూట్ తో సంక్రాంతి రేస్ కు కన్ఫామైన నితిన్ సినిమా!

Published on Sep 23, 2020 3:12 pm IST

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ లేటెస్ట్ గా “భీష్మ” చిత్రంతో అదిరిపోయే కంబ్యాక్ హిట్ ను అందుకున్నాడు. ఇక మళ్ళీ ట్రాక్ లో పడ్డ నితిన్ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు. అయితే ఇపుడు లేటెస్ట్ గా నితిన్ చేస్తున్న చిత్రం “రంగ్ దే” పై మరిన్ని పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి.

టీజర్ మరియు పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం షూట్ మిగిలి ఉన్న భాగాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తిరిగి మళ్ళీ ఈరోజు పునః ప్రారంభించేసారు. అంతే కాకుండా ఈ షూట్ స్పాట్ పిక్స్ తో పాటుగా ఈ సినిమా కేవలం థియేట్రికల్ రిలీజ్ మాత్రమే కానుంది అని కన్ఫామ్ చేసేసారు.

పైగా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలపనున్నట్టుగా దర్శకుడు సహా మేకర్స్ కన్ఫామ్ చేసేసారు. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఎట్టకేలకు వీరు సంక్రాతి రేస్ లో ఉన్నట్టుగా కన్ఫామ్ చేసేసారు. మరి ఈ బరిలో ఇంకా ఏ ప్రాజెక్టులు నిలుస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :

More