ట్రైలర్ తో ఆకట్టుకున్న నితిన్‌ ‘మాస్ట్రో !

Published on Aug 23, 2021 5:12 pm IST

నితిన్‌ ‘మాస్ట్రో’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. నభా నటేష్‌ కథానాయికగా తమన్నా కీలక పాత్రగా రాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ‘కళ్ళు కనపడకపోతే ఇబ్బందులు అందరికి తెలుసు, కానీ అందులో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి’ అంటూ సాగిన ఈ ట్రైలర్ లో మెయిన్ కంటెంట్ ను ఎలివేట్ చేస్తూ ఆసక్తికరంగా కట్ చేశారు.

ముఖ్యంగా నితిన్ – తమన్నా పాత్రలకు సంబంధించిన ట్రాక్ తో పాటు.. సినిమాలో మెయిన్ ఎమోషన్స్ ను ట్రైలర్ లో బాగా ఎలివేట్ చేశారు.
మొత్తానికి గ్రిప్పింగ్ గా ఉన్న ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. కాగా హిందీలో విజయవంతమైన ‘అంధాధూన్‌’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది.

కాగా మేర్లపాక గాంధీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది. ‘బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :