కొత్త సినిమాకు నితిన్ రెడీ

Published on Jun 3, 2021 3:00 am IST

హీరో నితిన్ వేగం పెంచారు. కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు ‘చెక్, రంగ్ దే’లతో ప్రేక్షకుల్ని పలకరించారు నితిన్. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ చిత్రం చేస్తున్నారు. ఇది హిందీ చిత్రం ‘అంధాధూన్’కు తెలుగు రీమేక్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా మీద నితిన్ చాలా ఆశలే పెట్టుకుని ఉన్నారు. ఇది కాకుండా ఇంకో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నారు నితిన్.

రచయిత కమ్ దర్శకుడు వక్కంతం వంశీకి నితిన్ ఇదివరకే ఓకే చెప్పి ఉన్నారు. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత వక్కంతం వంశీ డైరెక్ట్ చేయనున్న సినిమా ఇదే. మొదటి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వక్కంతం వంశీ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. లాంగ్ గ్యాప్ తీసుకుని పర్ఫెక్ట్ కథను సిద్ధం చేసుకుని నితిన్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు.

సంబంధిత సమాచారం :