ట్రీట్మెంట్ తీసుకుంటున్న నితిన్ !
Published on Feb 26, 2018 8:42 am IST

యంగ్ హీరో నితిన్ చేసిన తాజా చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’ ఏప్రిల్ 5న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. గత చిత్రం ‘లై’ భారీ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో నితిన్ కూడ ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు.

ఇకపోతే ‘ఛల్ మోహన్ రంగ’ షూటింగ్ సమయంలో డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు నితిన్ భుజానికి గాయమైంది. ఆ సమయంలో నితిన్ దాన్ని తేలిగ్గా తీసుకున్నా తర్వాత తర్వాత నొప్పి తీవ్రమవడంతో వైద్య పరీక్షలు చేయించుకుని గత కొన్ని రోజుల నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట నితిన్. త్వరలోనే ఈ ట్రీట్మెంట్ పూర్తై సినిమా విడుదల లోపల నితిన్ పూర్తిగా కోలుకుంటారని తెలుస్తోంది.

 
Like us on Facebook