నైజాంలో భీష్మ వసూళ్ల ప్రభంజనం.

Published on Feb 24, 2020 12:01 pm IST

భీష్మ నితిన్ కెరీర్ లో బెస్ట్ మూవీగా మిగిలిపోనుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్ల దిశగా వెళుతుతుంది. ముఖ్యంగా నైజాంలో భీష్మ వసూళ్ల జోరు ఓ రేంజ్ లో కొనసాగుతుంది. మొదటిరోజు 2.21 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం వీకెండ్ ముగిసే నాటికి 5.93 కోట్ల షేర్ రాబట్టి అబ్బురపరిచింది. శనివారం మరియు ఆదివారం భీష్మ వసూళ్లు మరింత మెరుగయ్యాయి. బాక్సాఫీస్ వద్ద పోటీలేని భీష్మ వసూళ్లు కుమ్మేయడం ఖాయం.

దర్శకుడు వెంకీ కుడుముల భీష్మ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. దాదాపు ఏడాదిన్నర విరామం తరువాత వచ్చిన నితిన్ భీష్మ రూపంలో సాలిడ్ హిట్ అందుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More