ముందే ‘చెక్’ పెడతానంటున్న నితిన్

Published on Jan 22, 2021 5:15 pm IST

యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తున్నారు. వాటిలో ‘చెక్’ కూడ ఒకటి. చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ చక చకా జరిగిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘రంగ్ దే’ విడుదలవుతుందని ఆ తరవాతే ‘చెక్’ వస్తుందని అందరూ భావించారు. కానీ ప్లాన్ రివర్స్ అయింది.

మొదట ‘చెక్’ రిలీజ్ కానుందట. ఫిలిం నగర్ సమాచారం మేరకు ఫిబ్రవరి 19న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ బాగా ఆకట్టుకుంది. చంద్రశేఖర్ యేలేటి గతంలో ‘ఐతే, అనుకోకుండా ఒకరోజు, సాహసం’ లాంటి థ్రిల్లింగ్ సినిమాలు చేసి ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పైగా సినిమాలో నితిన్ ఖైదీగా కనిపిస్తుండటం కూడ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు.

సంబంధిత సమాచారం :